NTV Telugu Site icon

Farmers’ Protests: రోడ్డెక్కిన రైతులు.. బ్యాంకు అధికారులపై సంచలన ఆరోపణలు!

Farmers' Protests

Farmers' Protests

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే 1043 మంది డాటాను పంపలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు రైతుల ఆరోపణ చేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యానికి తాము బలి అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలోని కెనరా బ్యాంక్ ముందు మెట్ పల్లి – ఖానాపూర్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. బ్యాంక్ తప్పిదం వల్లే మూడు విడతలుగా చేసిన రుణమాఫీ రాలేదని రైతుల ఆరోపణలు చేశారు. మెట్ పల్లి సీఐ సర్డిచెప్పడంతో ధర్నాను విరమించారు.

READ MORE: KTR: “అవును నాకు మహిళా కమిషన్ నుంచి నోటీసు వచ్చింది”

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఇండియన్ బ్యాంక్ ముందు రైతుల ధర్నా చేపట్టారు. అనంతరం వరంగల్ -కరీంనగర్ హై వే పై రైతుల ధర్నా రాస్తారోకో చేశారు. మరోవైపు.. నేడు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ లకు, సీఎస్ కు డేటా ఇస్తామని చెప్పారు. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామన్నారు. హరీష్ రావు ఆఫీసు పై దాడి చేశారని.. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారన్నారు.ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.