టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య పెద్దగా కలిసిరాలేదు.. గతంలో వచ్చిన లైగర్ సినిమా భారీ పరాజయాన్ని అందించింది.. మొన్నీమధ్య వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దాంతో తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నాడు.. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నారు.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది..
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి.. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతూనే విజయ్ డ్యాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయ్యినట్లు మేకర్స్ ప్రకటించారు.. విజయ్, మృణాల్, పరుశురాం కలిసున్న వీడియోను షేర్ చేశారు..
విజయ్ షేర్ చేసిన ఈ వీడియోలో షూటింగ్ అయిపోయిందని చెప్పడంతో పాటు త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నాం అని చెప్పుకొచ్చాడు.. ఈ సినిమా త్వరగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 5 న థియేటర్లలోకి రాబోతుంది.. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. మరి వారి అంచనాలకు ఈ సినిమా ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాలి..