Family Man3 : వర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి రెండు సీజన్‌లు మంచి విజయం సాధించాయి. దీంతో మూడవ సీజన్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ కొత్త సీజన్లో జైదీప్ అహ్లావత్ విలన్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ బబుల్‌లోని తాజా నివేదిక ప్రకారం.. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ నిమ్రత్ కౌర్‌ను షోకి రెండవ విలన్‌గా ఎంచుకున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లోని విలన్ పాత్రల గురించిన వివరాలు సీజన్ పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. జైదీప్ అహ్లావత్ సీజన్ లో భాగస్వామి అయిన తర్వాత నాగాలాండ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. మేకర్స్ జైదీప్ అహ్లావత్ పాత్రను కాస్త సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు.. కాబట్టి ఈ సిరీస్‌లో విలన్ పాత్ర గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also:Eluru Hospital: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం..
ది లంచ్‌బాక్స్‌లో తన నటనకు నిమ్రత్ కౌర్ గొప్ర ప్రశంసలు అందుకుంది. ఆ విజయం తర్వాత అమెరికన్ సిరీస్ హోమ్‌ల్యాండ్ అండ్ వేవార్డ్ పైన్స్‌లో కీలక పాత్రను పోషించింది. ఎయిర్‌లిఫ్ట్, దస్వి వంటి చిత్రాలలోను నటించింది. నిమ్రత్ నటనలో అద్భుతంగా రాణించిన చిత్రాలు ఇది. అయితే రాజ్ అండ్ డీకే లాంటి దర్శకులతో ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీలో చేరడంతో నిమ్రత్ గుర్తింపు మరింత పెరగనుంది. నిజానికి ఇది నిమ్రత్ కి గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపిస్తుంది కాబట్టి ఇది కచ్ఛితంగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.
Read Also:Sharda River: నదిలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి