Siddharth Nagar Sharda River Bus Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లా బధాని బ్లాక్ మోహన్‌కోలా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవిపటాన్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా చార్ గహ్వా వంతెనపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, ముగ్గురు వ్యక్తులు మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. బస్సులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
Read Also: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదటిసారి!
ఈ ప్రమాదానికి సంబంధించి సిద్ధార్థనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజగణపతి మాట్లాడుతూ.. శారదా నదిలో పడిన బస్సులో మోహన్ కోలా గ్రామానికి చెందిన 55 మంది ప్రయాణిస్తున్నారని, సమీప గ్రామాల ప్రజలు, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. దేవి పటాన్ ఆలయం నుండి ముందన్ సంస్కారం తర్వాత అందరూ తిరిగి వస్తుండగా బస్సు చార్ గహ్వా వంతెన వద్దకు చేరుకుంది. ఈ సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
Read Also: Italy PM On Lebanon: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య గొడవలు.. లెబనాన్ వెళ్లిన ఇటలీ ప్రధాని
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.