Site icon NTV Telugu

Fake Doctor: ఆ ఆస్పత్రికి వెళ్తున్నారా? మియాపూర్‌లో నకిలీ డాక్టర్ బాగోతం..

Fake Doctor

Fake Doctor

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్‌లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

READ MORE: Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు!

ఎలాంటి అర్హతల్లేకుండా ‘వైద్యులు’గా చలామణి అవుతున్న ఎందరో.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా ఆకర్షిస్తూ.. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్‌ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు.. నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పల్లెలనే తేడాల్లేకుండా ఇలాంటివారు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లిషు వైద్యం, ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్యమండలి వైద్యులు చెబుతున్నారు. అందుకే రోగులు వైద్యుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

READ MORE: Vidadala Gopinath: మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్..

Exit mobile version