ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్‌లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దని హాస్పిటల్…