NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెర్వు నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించి.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది అయితే.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది అని ఆయన వ్యాఖ్యనించారు. ఎన్నికలు రాగానే అధ్యక్షులు మార్చుతున్నారు.. ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్న మీకు ఓటమి తప్పదు అని హరీశ్ రావు అన్నారు. మీ ప్రయత్నాలు ఫలించావు.. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే ప్రభంజనం అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో 600 పెన్షన్ ఇచ్చి ఇక్కడ ఫేక్ మాటలు చెబుతున్నారు.. మీరు గెలిచిన కర్ణాటకలో ముందు 4 వేల పెన్షన్ ఇవ్వండని అన్నారు..

Read Also: Delhi Rains: హెచ్చరిక స్థాయికి యమునా నది నీటిమట్టం.. కేజ్రీవాల్ అత్యవసర మీటింగ్..!

ఢిల్లీలో గులాం గిరి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలే BRSకి హై కమాండ్ అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో బటన్ ఒత్తితే ఇక్కడ యాక్షన్ చేస్తారు.. ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవం కుదవపెట్టాల్సిన అవసరం లేదు.. ప్రధాని మోడీ కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు.. 20 వేల కోట్ల కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ 5 వేల కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. గుజరాత్ కి లడ్డు తీసుకుపోయి తెలంగాణకి పిప్పర్మెంట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా ఇచ్చే కేటాయింపులకు బీజేపీ వాళ్ళు సంఖలు గుద్దుకుంటున్నారు అంటూ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

Read Also: Free Cancer Screening Camp:మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన

జహీరాబాద్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టం కట్టి మిమ్మల్ని రైతులను చేశాడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు గిరిజనులని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి.. కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా ఉంది.. సినిమా హీరో రజినీకాంత్ హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని అనిపించింది అన్నాడు.. కేసీఆర్ అద్భుతంగా పని చేస్తున్నారు అని చెప్పారు.. మన పనితనం పక్క రాష్ట్రాల్లో ఉన్న రజినీలకు అర్థం అవుతుంది కానీ కాంగ్రెస్, బీజేపీలో ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు అని మంత్రి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యుడు.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేస్తాం అంటే కాంగ్రెస్ వాళ్లు వెన్ను చూపి పారిపోయారు.. మేము గడ్డిపోచల్లగా పదవులకు రాజీనామా చేశామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.