బంగారం మార్కెట్లో రోజుకో విధంగా రేటు మారిపోతోంది. బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. తక్కువకే బంగారం దొరుకుతుందంటే ఎగబడతారు జనం. అలాంటి బలహీనతని సొమ్ముచేసుకున్నారు కొందరు కేటుగాళ్లు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నకిలీ బంగారం అంటగట్టారు. ఈ నకిలీ బంగారంపై ఆకివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తక్కువ ధరకు బంగారం అంటూ ఆన్ లైన్ యాప్ లో పోస్టింగ్ పెట్టారు ఆకివీడు కి చెందిన ముగ్గురు వ్యక్తులు. ఆన్ లైన్ ఆప్ లో పోస్టింగ్ చూసి బంగారం కొనేందుకు ఆకివీడుకి వచ్చారు అనకాపల్లి జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మహేష్.
Read Also: KL Rahul: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. కేఎల్ రాహుల్‌కి పెద్ద దెబ్బ
అంతా బాగానే ఉందని మూడు లక్షల నలభై వేలుకు బంగారం కొనుగోలు చేశాడు. అయితే, ఆ బంగారంపై అనుమానం రావడంతో బంగారం దుకాణంలో చెక్ చేయడంతో బయటపడింది నకిలీ బంగారం. బంగారం అమ్మిన వాళ్ల దగ్గరికి వెళ్లి మోసం గురించి అడిగితే.. చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో లబోదిబోమంటూ ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అనకాపల్లి జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా జనంలో మార్పులు రావడం లేదని పోలీసులు పేర్కొన్నారు. బంగారం అంత తక్కువ ధరకు ఎవరూ ఇవ్వరని, ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Read Also: Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి