Sandhya Sreedhar Rao: సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్ రావును ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. పలు ఆరోపణలతో సంధ్యా శ్రీధర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోని ఉప్పలపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈనేపథ్యంలో.. సంధ్యాశ్రీధర్ రావు మాట్లాడుతూ.. 180 కోట్లు రుపాయలు నేనే చెల్లించానని పేర్కొన్నారు. న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ డాక్యుమెంట్ల అన్నింటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని పేర్కొ్న్నారు. న్యాయపరంగా పోరాడుతానని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేశాననడం అవాస్తవమని అన్నారు. నేనెవర్నీ మోసం చేయలేదని సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్ స్పష్టం చేశారు.
Read also: MLA Followers Attack: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుల దౌర్జన్యం
అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన శ్రీధర్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ట్రాక్టర్లు ఇస్తానని చెప్పి రూ. 250 కోట్లు మోసం చేశారంటూ అమితాబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. అయితే శ్రీధర్ రావు గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీధర్ రావు హైదరాబాద్‌తో పాటు ముంబైలో పలువురు బిల్డర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీధర్‌రావుపై గతంలో అసహజ లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. జిమ్ ట్రైనర్ అయిన తనపై శ్రీధర్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. సనత్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతేడాది గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్‌పై శ్రీధర్‌రావు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీధర్ రావు బెయిల్ పై విడుదలయ్యారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును పోలీసులు నవంబర్ 10న రాయదుర్గం పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.
Read also: Karimnagar Crime: జమ్మికుంటలో విషాదం.. అన్న తమ్ముల పిల్లలు ఒకేరోజు ఆత్మహత్య
శ్రీధర్ ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీధర్‌పై రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరయ్యారు. శ్రీధర్ రావు ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యురాలు తులసిని మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. 28 వేల ఎస్ ఎఫ్ టీ స్థలానికి రూ.15 కోట్లు అడ్వాన్స్ తీసుకుని తిరిగి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ సమీపంలోని 12 ఎకరాల భూమికి సంబంధించి శ్రీధర్‌పై మరో వివాదం కూడా ఉంది. అయితే శ్రీధర్ తను ఎవరిని మోసం చేయలేదని పేర్కొనడం చర్చకు దారితీస్తోంది. తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పడం న్యాయ పరంగా పోరాడతానని శ్రీధర్ రావు చెప్పడంతో ఈకేసులో మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అమితాబ్ బచ్చన్ బంధువులను మోసంపై శ్రీధర్ రావు ఎలాంటి సమాచారం ఇవ్వనున్నాడనే విషయం పై సర్వత్రా ఉల్కంఠ నెలకొంది.
Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ