Venky – Anil : అనిల్ రావిపూడి సినిమా ఫహద్ అవుట్.. తమిళ్ స్టార్ హీరో ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు.
Also Read : Prabhas : ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
Also Read
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమా తర్వాత తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమాలో నటించేందుకు ఆయన ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వడం బడ్జెట్ పరంగా భారమవుతుందని భావించిన మేకర్స్, ఫహద్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఫహద్ స్థానంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించి మెప్పించాడు కార్తీ. అటు బిజినెస్ పరంగాను కార్తీ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. గతంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు రాగా, తాజా పరిణామాలతో కార్తీ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో వెంకటేష్, కార్తీల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్లుగా కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
-
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
-
Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?