Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Heatwave: ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. అయితే, మన మొబైల్ ఫోన్లలోని వెదర్ యాప్స్ చూపించే నంబర్లకు బయట పరిస్థితులకు అస్సలు పొంతన లేదు. తూర్పు ఢిల్లీలోని జనసాంద్రత ఎక్కువగా ఉండే ‘నంద్ నగరి’ అనే ప్రాంతంలో ఉష్ణోగ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీన్‌పీస్ ఇండియా సంస్థ అందించిన థర్మల్ కెమెరా, హ్యాండ్‌హెల్డ్ టెంపరేచర్ మీటర్ (చేత్తో పట్టుకునే ఉష్ణోగ్రత మీటర్) సహాయంతో నంద్ నగరిలోని పలు ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలను (సర్ఫేస్ టెంపరేచర్) కొలిచారు. అందులో వచ్చిన ఫలితాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎండ నేరుగా పడే తారు రోడ్లు, అక్కడ పార్క్ చేసిన వాహనాల ఉపరితల ఉష్ణోగ్రత ఏకంగా 65°C కంటే ఎక్కువగా నమోదైంది. థర్మల్ కెమెరా అనేది వస్తువుల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ (కంటికి కనిపించని వేడి) ఆధారంగా రంగుల చిత్రాలను చూపిస్తుంది. ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాలు స్క్రీన్‌పై ఎరుపు లేదా తెలుపు రంగులో, చల్లగా ఉన్న ప్రాంతాలు నీలం లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఈ కెమెరాలో చూసినప్పుడు రోడ్లు నిప్పులు చెరుగుతున్నట్లు కనిపించాయి.
అయితే, అదే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు నీడలోకి వెళ్లి చూడగా, అక్కడ ఉష్ణోగ్రత ఒక్కసారిగా 40°C కి పడిపోయింది. కేవలం కొన్ని అడుగుల దూరంలోనే దాదాపు 20 డిగ్రీల సెల్సియస్ వ్యత్యాసం కనిపించడం సామాన్యమైన విషయం కాదు. 65°C వేడి ఉన్న రోడ్డుపై మనం నడిస్తే కేవలం కొన్ని సెకన్లలోనే బొబ్బలు వచ్చేస్తాయి. నంద్ నగరి వంటి ప్రాంతాల్లో చెప్పులు లేకుండా రోడ్లపై ఆడుకునే చిన్న పిల్లలకు దీనివల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో నేరుగా ఎండలో నిలబడి గాల్లోని ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్‌తో చెక్ చేయగా.. అది 48°C చూపించింది. కానీ, అదే సమయంలో మొబైల్ ఫోన్లలోని వెదర్ యాప్స్ మాత్రం అక్కడ 42°C ఉష్ణోగ్రత ఉన్నట్లు చూపించాయి. అంటే, అధికారిక వాతావరణ సమాచారానికి, మనుషులు అక్కడ అనుభవిస్తున్న అసలైన వేడికి మధ్య 6 డిగ్రీల తేడా ఉంది.
Also Read
ఈ తేడా ఎందుకు వస్తుందంటే.. అధికారిక వాతావరణ కేంద్రాలు ఉష్ణోగ్రతలను ఎప్పుడూ నీడలో, నేల నుంచి దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో, వేడిని ప్రతిబింబించే వస్తువులు లేని నియంత్రిత వాతావరణంలో కొలుస్తాయి. కానీ కాంక్రీట్ భవనాలు, మెటల్ వస్తువులు, వాహనాల పొగతో నిండిపోయిన ఇరుకైన వీధుల్లో ప్రజలు అనుభవించే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, అదే వీధిలో ఉన్న చెట్ల నీడలోకి వెళ్లినప్పుడు మాత్రం ఎయిర్ టెంపరేచర్ 42°C నుంచి 43°C కి పడిపోయింది. ఇది వెదర్ యాప్ చూపించిన రీడింగ్‌తో సరిగ్గా సరిపోయింది. చెట్లు తమ వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిని ఆకుల ద్వారా నీటి ఆవిరి రూపంలో గాల్లోకి విడుదల చేస్తాయి. దీనినే ఎవాపోట్రాన్స్‌పిరేషన్ అంటారు. ఈ ప్రక్రియ చుట్టుపక్కల ఉన్న వేడిని లాగేసుకుంటుంది. మనుషులకు చెమట పట్టినప్పుడు శరీరం ఎలా చల్లబడుతుందో.. ఇది కూడా అంతే! పైగా చెట్ల కొమ్మలు, ఆకులు సూర్యుడి ఎండ నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటాయి.
తాజావార్తలు
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!