పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై సభలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఇకపోతే పలు బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సమావేశాలు పొడిగిస్తున్నట్లు పార్లమెంట్ తెలిపింది. తాజా నిర్ణయంతో ఈనెల 8 వరకు జరగనున్న సమావేశాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి.
సోమవారం లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370 సీట్లు వస్తాయని.. ఎన్డీఏకి 400 సీట్లు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:Ajit Pawar: శరద్ పవార్‌కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్‌దే..