Summer Holidays: సమ్మర్ హాలిడేస్ పొడిగించండి.. ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రుల వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవాళ్టి( ఆదివారం)తో ముగిసిపోనున్నాయి. రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. రోహిణి కార్తె ముగిసి.. మృగశిర కార్తె వచ్చిన రాష్ట్రంలో ఎండలు ఇంకా తగ్గడం లేదు.. భానుడు తపానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభించాలనే ప్రభుత్వంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎండలు తగ్గలేదని.. ఇప్పటికీ అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.
Read Also: Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా?
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారం ముగిసిపోతున్నా.. సూర్యుడు ఇంకా భగభగమంటున్నాడు.. అధిక అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులపై మరోసారి ఆలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Also: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్..!
ఏపీలో ఎండలు విపరీతంగా కొడుతుండటంతో స్కూళ్లకు వచ్చే విద్యార్థులు ఎలా వస్తారు.. అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుంది.. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగిస్తారా లేదా పాఠశాలలు పున: ప్రారంభం చేస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంది. స్కూల్స్ ప్రారంభిస్తే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అనేది ఇప్పుడు వేచి చూడాలి..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!