NTV Telugu Site icon

Vizag Steel Plant Explosion: విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు.. 9మందికి గాయాలు

vizag blast

4a9d0ae2 664a 4546 9a3c Adfa73497fa8

పరిశ్రమల్లో ప్రమాదాలు ఆస్తి, ప్రాణనష్టాలను కలిగిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS -2 లో లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. నలుగురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, 5గురు ఒప్పంద కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం, తొమ్మిది మంది కార్మికులకు తీవ్రగాయాలు | Ntv

Read Also: Mohammed Shami: కోహ్లీని దాటేసిన షమీ..స్టార్ బ్యాటర్లనూ వెనక్కునెట్టి

ఇదిలా ఉండగా.. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం అసకపల్లి సున్నబట్టీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ చింతలపూడి అప్పలరాజు (నూకాలు కుమారుడు), అదే ప్రాంతానికి చెందిన గెడ్డం గంగరాజు, చింతలపూడి అప్పలరాజు (కొండయ్య కుమారుడు)…ముగ్గురూ గురువారం సబ్బవరం మండలం నారపాడు శివారు అమ్ములపాలెం గ్రామంలో గల బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. అక్కడ నుంచి విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

1.టీ జయకుమార్, ఎస్ఎంఎస్ 2, ఈశ్వర్ నాయక్ ఎస్ఎంఎస్ 3. అనిల్ బాహివాలి, డీజీఎం ఎస్ఎంఎస్ 2,
4. పోతన్న ఎస్ఎంఎస్ 2 కాంట్రాక్ట్ లేబర్ 60%
5. బంగారయ్య కాంట్రాక్ట్ లేబర్ 30%
6. సూరిబాబు కాంట్రాక్ట్ లేబర్ 30%
7. అప్పలరాజు కాంట్రాక్ట్ లేబర్ 20%
8. శ్రీను, కాంట్రాక్ట్ లేబర్ 90%
9. శేషు, కాంట్రాక్ట్ లేబర్

స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ లో గాయపడ్డ ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రికి చేరుకున్నారు సీఎండీ అతుల్ భట్. ప్రమాదానికి గల కారణాలపై బాధితుల నుంచి వివరాలు సేకరిస్తుంది యాజమాన్యం.

Read Also: Jamiat Ulama-i-Hind: భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి.. మోదీ, మోహన్ భగవత్ లాగే మాకు హక్కుంది..