Andhra Pradesh: దంచికొడుతున్న ఎండలు.. ఏప్రిల్‌ను మరిపిస్తున్న ఫిబ్రవరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. సార్వసాధారణంగా.. ఏప్రిల్‌లో నమోదు అయ్యే ఎండలు.. ఫిబ్రవరి రెండో వారంలోనే సుర్రుమనిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ నెల 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవవకాశం ఉందని.. ఈ వేసవి మరింత హీట్ పెంచుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలకు మించకుండా ఉంటాయి.. కానీ, ఈ ఏడాది ఇప్పటికే 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి..
Read Also: Hero MotoCorp : భారీ లాభాల్లో హీరో మోటో కార్ప్.. ఒక్కో షేరుకు రూ.100డివిడెండ్ ప్రకటన
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఏపీలో గడిచిన రెండు మూడు రోజులుగా పరిశీలిస్తే.. రాయలసీమ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నాయి.. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో.. ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రమైన ఎండలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటున్నారు.. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ఇక, ఎండల తీవ్రతతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు. మరోవైపు.. వేసవి తాపంతో.. క్రమంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?