Minister Appala Raju Fires on Pawan: ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు, స్థానిక ఎమ్మెల్యే గొర్లే కిరణ్. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం టెండర్లు విశ్వ సముద్ర దక్కించుకుందన్నారు. ఏడాదిన్నరలో పూర్తి చేసేలా ప్రణాళికలు వున్నాయన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న వలసలు. ఈ రాష్ట్రంలోని అనేక మంది మత్స్యకారులు వెస్ట్ కోస్ట్ అయిన కొచ్చిన్, చెన్నై వంటి సుదీర్ఘ ప్రాంతాలకు వలస వెళ్ళటం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో సువిశాల తీరప్రాంతం ఉండి కూడా కేవలం రెండే రెoడు హార్బర్ లు ఉండటం బాధాకరం.
గుజరాత్ లో18 నుండి20,తమిల్లనాడు 14 హార్బర్ లు ఉన్నాయి. మన రాష్ట్రంలో హార్బర్ ల నిర్మాణం దిశగా గత ప్రభుత్వాలలో ప్రయత్నం జరగలేదు. వైసిపి పర్భుత్వం ఇప్పుడు రాష్ట్రంలో 9 హర్భర్లు మంజూరు చేసాము. 4 హార్భర్లు వివిధ దశలలో ఉన్నాయి.జువ్వలదిన్నే వద్ద మరో 3 నెలల్లో పూర్తి చేసుకోబోతున్నాం. అనకాపల్లి జిల్లా పూడిమరక వద్ద హార్బర్ మంజూరు చేస్తున్నాము. పూర్తి స్థాయి హార్బర్ గా శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళ పేట వద్ద మార్చుకోబోతున్నాం. జిల్లాలో ఈ రెండు హర్భర్లు, భావనపాడు పోర్ట్ పూర్తయితే వంద శాతం వలసలు నివారించబడతాయి. ప్రతి ప్రభుత్వ హాయంలో వలసలు గురించి మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడూ గొప్ప ప్రయత్నం జరగలేదు. 350 నుండి 450 కోట్లు ఒక్కో హార్బర్ కి కర్చు చేస్తున్నాం. 3500 కోట్ల తో తీర ప్రాంతంలో మెరైన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ తీసుకురాబోతున్నారు. రాష్ట్రానికి ప్రధానమైన ఆస్తి సుదూర తీర ప్రాంతం. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక పోర్టులు అభివృద్ధి జరుగుతున్నాయి.
40 యేళ్ళ నుండి భావన పాడు పోర్ట్ గురించి వింటున్నాం.మార్చిలో భావనపాడు పోర్ట్, బుడగట్ల పాలెం హార్బర్ కి శంకుస్థాపన చేయబోతున్నాం. మంచినీళ్ళ పేట, బుడగట్లపాలెం హార్బర్లు జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. వంశధార ప్రాజెక్ట్ టెండర్ లను పూర్తి చేసి పలాస శివారు ప్రాంతాలకు కూడా రెండు పంటలకు నీరు అందిస్తున్నారు. డోoకూరు నుండి తడ వరకు మెరైన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కి అవకాశం ఉందన్నారు. రాబోయే రోజులలో జరగబోయే భగీరధ ప్రయత్నాన్ని ఎవరైనా విమర్శిస్తే తిప్పి కొట్టాలి. పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ లకు మత్స్యకార వలసలు గురించి తెలుసా? 1990 లో మా అన్నయ్య వాళ్లు బొoబాయి వలస వెళ్లి నన్ను చదివించారు.
గతంలో కేంద్రంతోను ,చంద్రబాబుతోను సఖ్యతగా ఉన్నారే అప్పుడు ఇక్కడ ఎందుకు పోర్ట్ కట్టలేదని ఒక్క మాటాయిన అడిగారా? గుడ్డి గాడిదకు పళ్ళు తోముతున్నారా వీళ్లు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఎప్పుడైనా ఒక హార్బర్ కి శంకుస్థాపన చేయటం ఎప్పుడైనా చూసారా? జగన్ ని విమర్శించటం అంటే ఆకాశo పై ఉమ్ము వేయటమే? నిజ జీవితంలోని పవన్ యాక్షన్ ను అసహ్యిoచుకునేలా ఉంది. చంద్రబాబు కు ఊడికం చేసిన నీకు ఇన్నాళ్లకు మత్స్యకారులు గుర్తిచ్చారా?పవన్ మాట్లాడే ప్రతి మాటకు ఒక రేటు ఉంటుందన్నారు మంత్రి అప్పలరాజు. జన సైనికుల సంకల్పాన్ని ఒక రేటు పేట్టి తాకట్టు పెట్టారు పవన్. ఆయన్ను నిలదీయండి అన్నారు.