కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.