NTV Telugu Site icon

RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Rk Roja

Rk Roja

RK Roja: ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్‌కి తిప్పారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎస్పీకి ఎంత ఒత్తిళ్లు వస్తున్నాయో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. హోం మంత్రి సరిగ్గా పనిచేయలేదని పవన్ కల్యాణ్ మాట్లాడడం వెనుక కారణాలు ఏంటని ఆమె ప్రశ్నించారు.

Read Also: Pawan Kalyan: భూములు ఇవ్వబోమన్నవారిపై పెట్రోల్‌ బాంబులు వేశారు..

ఒక దళిత హోంమంత్రిపై నిందలు వేసి చేతులు దులుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్‌కి ఎవరు నచ్చలేదో వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం రుద్దుతారని.. నేరుగా సీఎం, మంత్రి లోకేష్ డీజీపీ నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు బదిలీలు చేసుకున్నారని అన్నారు. వారికి నచ్చిన వాళ్ళను వేసుకొని ఘటనలకు పాల్పడ్డ వ్యక్తులను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. యూపీ సీఎంలా పనిచేయాలి అని అంటున్న పవన్ కల్యాణ్ .. యోగిలా పనిచేయమని చంద్రబాబుకు పవన్ చెప్పాలన్నారు. అధికారం చేతిలో ఉన్న వాళ్ళు తప్పులు జరగకుండా చూడాలన్నారు. పిఠాపురంలో ఒక మైనర్ బాలికపై రేప్ జరిగితే, కనీసం పలకరించలేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఫెయిల్యూర్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే లోకేష్ విదేశాల్లో తిరుగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

గుడ్లవల్లేరులో అమ్మాయిల మాన ప్రాణాలు పోయేవిధంగా వీడియోలు తీస్తే, వాళ్ళని బెదిరించి కప్పిపెట్టారన్నారు. విద్యా శాఖ మంత్రి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కాలేజీల్లో అమ్మాయిలపై దాడులు జరుగుతుంటే విద్యా శాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి వాసవి నగర్‌లో అమ్మాయిపై దాడి జరిగిందన్నారు. రుషికొండ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది, ఇక్కడ మహిళలపై జరుగుతున్న దాడుల్ని చూడాలన్నారు. మీ వల్ల కాకపోతే రాజీనామా చేయాలన్నారు. మోడీని వేడుకుంటున్న మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలను చూసి రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. హిందూపురంలో అత్తకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ షూటింగ్స్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈవీఎంను మేనేజ్ చేసి గెలిచిన పరిపాలన ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. డమ్మీ హోం మంత్రిని పెడితే మహిళల పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. జగన్ తిరుపతికి వస్తున్నారన్న సమాచారంతో బాధితులను బెదిరించి చెప్పిస్తున్నారన్నారు.

 

Show comments