NTV Telugu Site icon

Harish Rao: గ్యారంటీలపై రాహుల్‌తో రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పించారు

Rai

Rai

ఆరు గ్యారంటీలపై రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిర్మల్ సభలో పట్టపగలు రాహుల్ గాంధీతో పచ్చి అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడిందే కాకుండా రాహుల్ గాంధీతో అబద్దాలు చెప్పిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఏ హామీలు అమలు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే రాహుల్ అంతకు మించిన అబద్దాల కోరని నిర్మల్ సభలో రుజువు అయ్యిందన్నారు. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్… ట్రిపుల్ ధమాకాకి రెడీ అవ్వండి

‘‘ఆరు గ్యారంటీలు అమలు చేశామని రాహుల్ చెబుతుంటే రేవంత్ రెడ్డి చప్పట్లు కొడుతున్నారు. మహిళలకు రూ.2500 ఇస్తున్నామని చెప్పడం రాహుల్ గాంధీ అవగాహన లేమికి నిదర్శనం. రాహుల్ గాంధీకి ఈ స్క్రిప్ట్ రాసించ్చింది ఎవరు అని నిలదీశారు.. లేక రాహుల్ గాంధీ కావాలని అబద్దాలు చెప్పారా?, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయనందుకు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటి తప్ప మిగతా ఐదు పూర్తి కాలేదు. ఆరు గ్యారంటీలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను.’’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. మహిళా ఎంపీకి డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులు..

‘‘మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం. చర్చకు రాహుల్ గాంధీ వస్తారో.. రేవంత్ రెడ్డి వస్తారో మీరే తేల్చుకోండి. దేశంలో పెదరికానికి కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఇంకా మేము పేదరికాన్ని నిర్మూలిస్తామని చెబుతున్నారు. పేదరికానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి ఇచ్చిన గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: CSK vs PBKS: రాణించిన జడేజా.. సీఎస్కే ఎంత స్కోరు చేసిందంటే..?