Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. మహిళా ఎంపీకి డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia: ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ ఎంపీగా ఉన్న బ్రిటనీ లాగా(37)కి డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు. ఇది ఎవరికైనా జరిగి ఉండొచ్చు, ఇది విషాదకరం, ఇది మనలో చాలా మందికి జరుగుతుంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గత వారాంతంలో నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్ లాండ్ లేబర్ పార్టీ ఎంపీ బ్రిటీనీ లాగా చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ఇటీవల ఈ ప్రాంతంలో ఇతర మహిళలపై కూడా ఇలాగే లైంగికదాడికి పాల్పడ్డారని చెప్పడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్ 28న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి పరీక్షల్లో తన శరీరంలో, తాను తీసుకొని డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారని ఆమె చెప్పింది. ఆ పదార్థం తనపై గణనీయంగా ప్రభావం చూపించిందని, ఇతర మహిళలు కూడా తనను సంప్రదించి తమ దుస్థితిని పంచుకున్నారని ఆమె చెప్పింది. లాగా దాదాపుగా ఒక దశాబ్ధంగా పార్లమెంట్ సభ్యురాలిగి ఉన్నారు, ఆమె మొదటిసారిగా 2015లో కెప్పెల్ స్థానానికి ఎన్నికయ్యారు.
ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న క్వీన్స్ లాండ్ పోలీసులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇతర నివేదికలు ఏమీ లేవని, ఎవరికైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని కోరారు. క్వీన్స్‌లాండ్ హౌసింగ్ మంత్రి మేఘన్ స్కాన్లాన్ ఆరోపణలను షాకింగ్, భయంకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో అత్యధికంగా లింగ-ఆధారిత హింస చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా గృహ హింసను “జాతీయ సంక్షోభం”గా అభివర్ణించారు. స్త్రీద్వేషపూరిత ఆన్‌లైన్ కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!