గత 24 గంటల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టారు. సోమవారం సతారాలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు అందరూ నా వెంటే ఉంటారని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు నేటి నుంచి మార్పు మొదలవుతుందని, ఎన్సీపీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతు తమకు ఉంటుందని శరద్ పవార్ తెలిపారు. ఈ ప్రేమ ఇలాగే కొనసాగితే రూపురేఖలు మారిపోవడం ఖాయం అని ఎన్సీపీ అధినేత పేర్కొన్నారు. దేశంలో భిన్నమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ తమతోనే ఉన్నారని శరద్ పవార్ తెలిపారు.
Good Night: డిస్నీ+హాట్ స్టార్‌లో సందడి చేస్తున్న ‘గుడ్ నైట్’
మరోవైపు మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా జయంత్ పాటిల్ ఉన్నారని, కాబట్టి అజిత్ పవార్ మాటలకు ప్రాముఖ్యత లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. తనను విడిచిపెట్టిన ఎమ్మెల్యేల గురించి శరద్ పవార్‌ను ప్రశ్నించగా.. వారందరి భవితవ్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని ఆ విషయంపై తాను మాట్లాడబోనని చెప్పారు. మరోవైపు మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా శరద్ పవార్ టార్గెట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ ఎన్సీపీపై అవినీతి ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు అదే పార్టీకి చెందిన వారిని ప్రభుత్వంలో చేర్చుకున్నారని పవార్ అన్నారు. పార్టీని వీడిన వారెవరూ నాతో మాట్లాడలేదని శరద్ పవార్ అన్నారు.
Sharad Pawar: కొంతమంది బలైపోయారు.. అజిత్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ఓ వైపు పార్టీ నిర్వహణలో శరద్ పవార్ బిజీగా ఉంటే మరోవైపు తిరుగుబాటు చేసిన అజిత్ పవార్‌పై చర్యలు మొదలయ్యాయి. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అజిత్ పవార్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నారని, అలాగే పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును ఉపయోగించరాదని తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. అలా చేయడం ద్వారా అజిత్ పవార్‌పై పార్టీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని జయంత్ పాటిల్ అంటున్నారు.