NTV Telugu Site icon

Women Big Bash League: బ్యాట్ విరిగినా, బాల్ సిక్స్ వెళ్లింది.. వీడియో ఇదిగో

Harris

Harris

Women Big Bash League: మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. హారిస్ నార్త్ సిడ్నీ ఓవల్‌లో 136 పరుగులతో అద్భుతమైన సెంచరీని సాధించి WBBL చరిత్రలోనే రికార్డు నెలకొల్పింది. హరిస్ తన ఇన్నింగ్స్‌లో 59 బంతులు ఆడి అద్భుతమైన షాట్‌లు కొట్టింది.

Read Also: YV Subba Reddy: టీడీపీకి తొత్తుగా వ్యవహరించే జనసేనకు ఓటేస్తే నష్టం తప్పదు..

మ్యాచ్ అనంతరం హారిస్ మాట్లాడుతూ.. నార్త్ సిడ్నీ ఎప్పుడూ గొప్ప బ్యాటింగ్ వికెట్ అని. ఇది బ్యాట్స్‌మెన్‌కు చాలా మంచి మైదానమని చెప్పింది. ఈ పిచ్ పై నేను బాగా ఆడగలని నాపై నమ్మకం వచ్చిందని పేర్కొంది. మొదట బ్యాటింగ్ చేసిన హీట్ ఉమెన్ అండ్ పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.ఈ ఇన్నింగ్స్‌లో గ్రేస్ హారిస్ అత్యధిక పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో రంగంలోకి దిగిన బ్రిస్బేన్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో హారిస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధిచింది.

Read Also: Sehar Shinwari: పాకిస్థాన్ నటి మరోసారి బంపర్ ఆఫర్.. ఈసారి న్యూజిలాండ్కు