గజ్వేల్ నియోజకవర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు. 2017లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 1700 మంది ఉద్యోగాలు తీసేశారు.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనికరం కూడా లేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని సీఎం కేసీఆర్ అన్నారు అనే విషయాన్ని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.
Read Also: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
హుజురాబాద్ ఉప ఎన్నికలో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి వేల కట్టిన చరిత్ర కేసీఆర్ ది.. నా దగ్గర ఉన్న మనుషులను కోవర్టు, ఇన్ ఫార్మర్లుగా మార్చుకున్నారు అని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఎవరికి ఏం కావాలో అన్ని చేశారు సీఎం కేసీఆర్.. అన్ని పనులు చేయించుకున్నారు కానీ ఓటు మాత్రం నాకే వేశారు.. డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బంధు, బీసీ బంధు అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అని అన్నారు. తాగుబోతులలో దేశంలో నంబర్ 1 స్థానానికి తెలంగాణ చేరింది అని ఈటెల రాజేందర్ విమర్శించారు.
Read Also: ENG vs SL: శ్రీలంకతో కీలక మ్యాచ్.. 156 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ లిక్కర్ రాజ్యమేలుతోంది అని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. నాకు జీవితమంటూ ఉంటే కేసీఆర్ పై పోటీ చేస్తా అని ఆనాడే చెప్పిన.. నేను గజ్వేల్ కి ఏమిస్తానో తెలియదు కాని నా వల్ల మీ అందరి విలువ పెరిగింది.. నేను కేసీఆర్ తో పైసల్లో పోటీ పడకపోవచ్చు.. నేను బక్క పలుచని వ్యక్తినే.. గజ్వేల్ ప్రజల అండ, ధర్మం, న్యాయంతో కేసీఆర్ తో కొట్లాడుతాను అని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే వందల ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, మామిడి తోటలు పెట్టె రైతులకు, ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి రైతు బంధు బంద్ చేస్తామని ఆయన తెలిపారు. రైతు కూలి చనిపోతే మేం 5 లక్షల భీమా ఇస్తాం.. గజ్వేల్ కి పట్టిన పీడ పోవాలంటే ఓటే మన ఆయుధం అని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.