Site icon NTV Telugu

Etela Rajender: 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Etela

Etela

నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.. ఇప్పుడు అదే పార్టీ మీద నిలబడ్డాడు మరి ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు అని అన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ఇక, కేవలం 5, 6 నెలల కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే.. భారత ప్రభుత్వం అన్ని గమనిస్తుంది.. తప్పు చేసిన వాళ్ళందరూ తప్పకుండా జైలుకు వెళ్తారు.. బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు అని ఈటెల రాజేందర్ అన్నారు.

Read Also: Virat Kohli: విరాట్.. ఇప్పటికైనా ఆర్‌సీబీని వదిలేసేయ్! మాజీ దిగ్గజం సూచన

కాగా, బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయలేదనే బాధ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

Exit mobile version