Site icon NTV Telugu

Etela Rajender: ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది..

Etala Rajender

Etala Rajender

తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని సీఎం అభాండాలు వేస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందని ఆరోపించారు. అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పడుతుంది అనే సోయితో పనిచేయండని సూచించారు. బేశాజాలకు పోకుండా వారు అడుగుతున్న డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Read Also: Dhruv Rathee: ఫేక్‌న్యూస్‌పై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై కేసు..

రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారని తెలిపారు. వీరికి ఏజెన్సీల ద్వారా జీతాలు అందిస్తున్నారు.. ESI, PF, GST పోయిన తర్వాత రూ.9 వేలు కూడా రావడం లేదని తెలిపారు. వీరు అడుగుతున్న డిమాండ్లు పెద్దవి కావు.. డిపార్ట్మెంట్ నేరుగా జీతాలు ఇవ్వాలనీ కోరుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సేఫ్ గార్డ్స్ ఇవ్వాలని కోరారు. నెల వారీగా జీతాలు ఇవ్వాలి.. ఉద్యోగం తీసివేయకుండా భద్రత కల్పించాలని ఎంపీ పేర్కొన్నారు. ESI, PF, హెల్త్ కార్డులు కల్పించాలి అని అడుగుతున్నారు.. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.

Read Also: Raj Tarun Case: తిండి లేక ఇబ్బంది పడుతున్నా.. తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్.. లావణ్య కీలక వ్యాఖ్యలు

Exit mobile version