NTV Telugu Site icon

Etela Rajender : నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను

Etela

Etela

Etela Rajender : నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజలున్న మన భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ, మన నాయకుడు మోదీ అని ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనదని, GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే బిజెపికి 35% ఓట్లు వచ్చాయి. ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అని ఈటల రాజేందర్‌ అన్నారు.

మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన నేరెడ్ మేట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ఆకారం సాయి తదితరులు చేరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా జాతీయ అధ్యక్షుడు దగ్గరనుండి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఈ పార్టీ నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బ్రతకదు. ప్రతి ఒక్కరూ ఓనర్లె అని ఆయన అన్నారు. బీజేపీలో కూడా ప్రతి ఒక్కరూ ఓనర్ లెక్కనే ఉంటారని, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ బీజేపీ అని ఈటల రాజేందర్‌ తెలిపారు.

Goa Liquor: గోవా నుంచి మద్యం తెస్తున్నారా? ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారో చూడండి..

అంతేకాకుండా..’దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనిపించడం లేదు అని సీనియర్ BRS, కాంగ్రెస్ నాయకులు ఈరోజు నాతో అన్నారు. ఆ మాటలు విని నేను గర్వపడ్డా. మహాభారతంలో సంజయుడికి మాత్రమే ఎక్కడ ఏం జరుగుతుందో చూసే శక్తి ఉండేది.. ఆయనే ధృతరాష్ట్రునికి యుద్ధంలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చెప్పేవాడు. కానీ ఈనాడు సెల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి సామాన్యుడు తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ సంజయుడే. సిరియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్ధాన్, బంగ్లాదేశ్ లో జరుగుతున్న నరమేదాన్ని గమనిస్తున్నారు. 140 కోట్ల ప్రజలున్న మన భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ, మన నాయకుడు మోదీ అని అందరికీ అర్థం అయ్యింది. భారత జాతి అంతా అదే భావనకు వచ్చింది.

మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి అధికారం ఇచ్చాం కానీ ఇంకా శక్తివంతం చేయాల్సిఉండే అనే అభిప్రాయం పార్లమెంటులో జరిగే పరిణామాలు చూసి అనుకుంటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది.. ఆ శక్తి ఇచ్చి ఉంటే భారత్ ఇంకా సుభిక్షంగా ఉండేదని భావిస్తున్నారు. అందుకే ఏ ఎన్నిక జరిగినా బీజేపీకే పట్టం కడుతున్నారు. మోడీ ఆయురారోగ్యాలతో ఉండి మరింతకాలం ఈ దేశానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే స్థితిని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది.

కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే మనది మాత్రం స్థిరంగా ఉండటమే కాదు ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. 11 వ స్థానం నుండి 5వ స్థానానికి ఎదిగింది. మూడవ స్థానంలో నిలబెట్టాలి అనేది మోడీ గారి సంకల్పం. ప్రపంచంలో దేశానికి అయినా అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. అందుకే ప్రజలందరి గుండెల్లో మోడీ స్థానం సంపాదించుకున్నారు. వికసిత భారత్ కోసం కలలు కంటున్నారు.

భారతదేశం విశ్వగురువుగా ఎదగటానికి మోడీ వేసిన పునాది పని చేస్తుంది. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనది. GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే బిజెపికి 35% ఓట్లు వచ్చాయి. ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే.’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Recharge Best Plans: ఓటీటీ ప్లాన్స్ అందించే బెస్ట్ రీఛార్జ్‭లు ఇవే..

Show comments