ప్రగతి భవన్ అండగా సైకో శాడిస్ట్ కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన వరంగల్ మాట్లాడుతూ.. నన్ను అంతమొందించేందుకు సుపారీ ఇచ్చినట్టుగా సమాచారం ఉందన్నారు. కనీస విలువలు లేని వ్యక్తిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మండలిలో విప్ పదవి ఇచ్చారని, ఆ పదవితో కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాడని, ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
Also Read : YS Jagan: వాటి అన్నింటిపై దత్తపుత్రుడికే పేటెంట్.. పవన్‌లా మనం చేయలేం..!
కిడ్నాప్ లు చేస్తున్నాడు, నానా బూతులు మాట్లాడుతున్నాడని, కౌశిక్ ఆగడాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించాడని… కానీ కరీంనగర్ కమిషనర్ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని ఈటల వ్యాఖ్యానించారు. నయీం బెదిరింపులకు భయపడలేదు, కౌశిక్ ఎంతని ఆయన అన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ రాజకీయ విలువలు ఉంటే కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయవద్దని రైతులంతా భావిస్తున్నారని ఈటల రాజేందర్చెప్పారు. తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ఓటమి తప్పదని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మోడల్దేశానికి అందిస్తానన్న కేసీఆర్.. ఇక్కడి ప్రజలకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్‌చేశారు ఈటల.
Also Read : Merugu Nagarjuna: ఏపీ ధృవతార జగన్.. ఆయన ఎదుగుదలని ఏ శక్తి ఆపలేదు..