NTV Telugu Site icon

Etela Rajender : తొలి దళిత రాష్ట్రపతిని చేసింది మోడీ

Etela Rajender On Kcr

Etela Rajender On Kcr

సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. వరంగల్ బీజేపీ ఆఫీసులో ఈటల రాజేందర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణ సాధించడమే లక్ష్యం అని చెప్పారని, కడప కాడ కుక్కలగా ఉంటా అన్నారని, తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తా అన్నారని గుర్తు చేశారు. కానీ.. మొదట దళితుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్‌ అని ఆయన మండిపడ్డారు. దళితున్ని ఉప ముఖ్యంత్రి పదవీ తీసేశారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో దళితులకు 12మందికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. తొలి దళిత రాష్ట్రపతిని చేసింది మోడీ అని ఆయన కొనియాడారు.

Also Read : AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?

1.8 సంత్సరకాలంగా ఫస్ట్ ఫేస్‌లో దళితులకు దళిత బంద్ అందలేదని, ఎమ్మెల్యే బంధువులకు దళిత బంద్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. అందరికి దళిత బంద్ ఇవ్వాలి అంటే 40సంత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా… సీఎంవో ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ లేరని ఆయన దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ఆటలు చూస్తున్నారని, టైం వచ్చినప్పుడు ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని ఆయన అన్నారు.

Also Read : Minister KTR : తెలంగాణ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ ఎకోసిస్టమ్‌ను ప్రపంచ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి