NTV Telugu Site icon

Etela Rajender : నేను గజ్వేల్‌కి పోతే కేసీఆర్ కామారెడ్డికి పోయిండు

Etela

Etela

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మామిండ్లవాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. దమ్ముంటే నాపై పోటీ చెయ్ కానీ శిఖండిలా కొట్లాడకు అని ఆరోజే చెప్పిన అని అన్నారు. నేను గజ్వెల్ కి పోతే కెసిఆర్ కామారెడ్డికి పోయిండని, నేను గెలిచినా నన్ను కనీసం అసెంబ్లీ కి కూడా రానీయలేదన్నారు ఈటల రాజేందర్. గజ్వేల్ కి నువ్వు రావడం మా అదృష్టం అంటున్నారు అక్కడి ప్రజలు అని, హుజురాబాద్ నియోజకవర్గం కి నాకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉందన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే తప్ప మునిసిపల్ గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని, తాగుడుమీద 45 వేలకోట్లు ప్రభుత్వం కి మనం ఇస్తున్నం మనకి పథకాల పేరుతోటి కేవలం 14 వేల కోట్లు ఇస్తున్నాడన్నారు.

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే

నెంబర్ వన్ ఉన్న తెలంగాణ ఈరోజు తాగుట్ల మాత్రమే నెంబర్ వన్ అని ఆయన వ్యాఖ్యానించారు. రేషం కళ్ల బిడ్డను కాబట్టి ఏనుగు కుంభ స్థలం కొట్టటానికే గజ్వేల్ పోయిన అని, అభిమన్యుడిలా పోతున్న అర్జునిడిలా తిరిగి వస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉంది. ఎన్నడూ లేనిది కార్యకర్తలను బ్రతిమలాడుతున్నారు. ఏది కావాలంటే అది ఇస్తా అంటున్నారు. ఇక్కడ ఇచ్చారా దళితబంధు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నాడు. మరి మనసులేదా ? కేసీఆర్ 10 ఏళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా ? ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఎక్కాక బోడమల్లన్న అనేది కేసీఆర్ నైజం. కాళేశ్వరం నీళ్లు బందారం రాకముందే గోదావరిలో మునిగిపోయింది అని ఈటల వ్యాఖ్యానించారు.

Congress: బీజేపీకి అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీ.. “ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ” వ్యాఖ్యలపై కాంగ్రెస్