బీఆర్ఎస్ కు ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు రాజీనామా చేశారు. నేడు ( సోమవారం ) బీజేపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయినా తనకు టికెట్ రాలేదని వాపోయారు. ఇవాళ సంగారెడ్డి స్టేడియం గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నానని పులిమామిడి రాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ బీజేపీ పార్టీ ఎక్కడిది అని ఎగతాళి చేస్తాడన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు అసలు సంబంధం లేదని, తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి సీఎం దళితుడినే చేస్తానని చెప్పి మాట తప్పిండని ఆయన మండిపడ్డారు.
Also Read : Raghunandan Rao : బీసీల గురించి గొప్పగా చెప్పే సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు
అంతేకాకుండా.. ‘నీ ఫోటతో నేను గెలిచినా నా ఫోటోతో నేనే గెలిచినా తేల్చుకుందామని ఉప ఎన్నికకు పోయి గెలిచాను. బీఆర్‌ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఆ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా సీఎం కాలేరు. మహారాష్ట్ర పార్టీ ఇంచార్జ్ పదవి కూడా కేసీఆర్ అన్న కొడుక్కి ఇచ్చారు. ముదిరాజులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడు..ముదిరాజులంతా కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. చాయ్ అమ్ముకున్న బిడ్డ దేశ ప్రధాని అయ్యాడు అంటే అది బిజెపి పార్టీ గొప్పతనం. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తాం. దళితబంధు ని అసలైన దళితులకు ఇస్తాం… ఉన్నోళ్లకు ఆపుతాం. రైతు బంధు కూడా చిన్న సన్నకారు రైతులకు ఇస్తాం..కౌలు రైతులకు కూడా ఇస్తాము. తెలంగాణలో బిజెపి అధికరంలోకి వస్తే మేమే ధాన్యం కొంటాం’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Also Read : MLA Seethakka : చదువు కావాలంటే గొర్లు, బర్లు తీసుకోండని ప్రభుత్వం చెప్తోంది