NTV Telugu Site icon

Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వమని అడిగా..

Etela Rajender

Etela Rajender

Etela Rajender: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్‌ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. అధిష్టానం ఎలా చెబితే అలా వింటానని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లర మల్లరగా రాస్తున్నాయని.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు.

Read Also: Chandrababu: పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజాసేవ

రెండవ విడుత దళిత బంధు వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమెరికా లాంటి అగ్రరాజ్యం భారతదేశానికి రెడ్ కార్పెట్ వేస్తుందని, మోడీ వల్లే మన దేశం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తుంది అంటున్నారని.. ప్రజలు అధికారం బెట్టారని, మళ్ళీ కూల్చే అధికారం వారికే ఉంటుందన్నారు. 2018లో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారుని.. అందుకే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్పారన్నారు.