తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ చేరికల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌చుగ్ మాట్లాడుతూ.. చేరికలు వేగ వంతం చేయండని సూచించారు. అంతేకాకుండా.. బలమైన నేతలు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉంటే భరోసా ఇవ్వండి… తీసుకు రండి అని ఆయన తెలిపారు. 80 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు… వారి కంటే బలమైన వారు వస్తె తీసుకుందామన్నారు. మిగతా నలబై నియోజక వర్గాల్లో బలమైన నేతలను చేర్చుకోవాలని, సీటు ఇచ్చే విషయంలో విశ్వాసం కల్పించండి… సీటు అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేమన్నారు.
Also Read : Extramarital Affair : వివాహేతర సంబంధం వదులుకోలేక ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు
ఇదిలా ఉంటే.. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల సమన్వయ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందన్నారు. ఇతర పార్టీల్లోని నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరాలని భావిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు చూస్తున్నామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వేలాది మంది సర్పంచ్, ఎంపీటీసీలు రాష్ట్ర ప్రభుత్వంపై మంటతో ఉన్నారని ఈటల తెలిపారు. గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతుందని, చేరికలు పై కూలంకషంగా చర్చించామన్నారు ఈటల.