కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయకు… భూమి మీదకు రా అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఎట్టి పరిస్థతుల్లో బీఆర్‌ఎస్ గెల్వదని ఆయన అన్నారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, చిన్న కులాల వాళ్ళ పై చులకనగా మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు స్పెషల్ మిషన్ అప్పగించారు అట.. ఏమీ చెప్పారో మరి అంటూ ఆయన విమర్శించారు. క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి అని ఈటల డిమాండ్ చేశారు. కుట్ర జరుగుతుంది నన్ను జాగ్రత్తగా ఉండు అని మా వాళ్ళు చెప్పారన్నారు. కౌశిక్ రెడ్డి 20 కోట్ల సుపారి ఇచ్చాడు అట… నయీం నా పై రెక్కీ చేశాడు అయిన భయపడలేదు.
Also Read : ITBP Recruitment: పదోతరగతి అర్హతతో ఉద్యోగాలు..458 పోస్టులకు దరఖాస్తులు..
నాది భయపడే జాతి కాదు మాడి మసై పోతారు. నేను పార్టీ మారలేదు… నన్ను వెళ్లగొట్టింది ఆ పార్టీ. నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ. పార్టీలన్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి…అసంతృప్తి గా లేను. బీజేపీ లో అనేక మంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి అధికారం కోసం కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు… నేను జాతీయ రాజకీయాల కు కొత్త. నాకు నేనుగా ఢిల్లీ కి వెళ్ళలేదు… పిలిస్తే పోయాను.. అడిగితే మాత్రమే చెప్పాను. వ్యక్తిగతంగా ఎవరి మీద హై కమాండ్ తో మాట్లాడలేదు. నాకేమీ కేసీఆర్ కుటుంబం తో పంచాయతీ లేదు… నేను బయటకు వచ్చిన రోజు ఆ కుటుంబం కూడా బాధ పడి ఉంటుంది… కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని మీరే నెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను కొట్టేది వంద శాతం బీజేపీనే ‘ అని ఈటల వెల్లడించారు.
Also Read : World Bank: ఛత్తీస్‌గఢ్ పాఠశాలల కోసం ప్రపంచ బ్యాంకు భారీ రుణం