నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ఖాళీలు ఉన్న పలు సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ఈఎస్‌ఐసీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బీమా సంస్థ, తాజాగా గ్రూప్- సీ విభాగంలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ esic.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1038 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈఎస్‌ఐసీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పోస్ట్‌ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేర్వేరుగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ పరిశీలించాలి..
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.250 పేమెంట్ చేయాలి.. ఆన్లైన్లో మాత్రమే ఫీజును చెల్లించాలి..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
పారామెడికల్ స్టాఫ్ పోస్ట్‌ల భర్తీకి అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్కిల్ టెస్ట్, మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, నాలుగో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటికి సంబంధించిన షెడ్యూ్ల్‌ను ఈఎస్‌ఐసీ త్వరలో ప్రకటిస్తుంది…
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఈఎస్‌ఐసీ అధికారిక పోర్టల్ esic.gov.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, రిక్రూట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఈఎస్‌ఐసీ పారామెడికల్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలించాలి. ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఫిలప్ చేయాలి.
డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేసి ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.. అనంతరం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి..
ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవడం మంచిది..