NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : 24 గంటల కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్

Errabelli

Errabelli

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల వద్ద 14.5 కోట్లతో నిర్మించిన బ్రిడ్జ్‌ని మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం లో నీటి వనరులు పడిపోయాయని, తెలంగాణలో మాత్రం వెలుగొందుతున్నాయన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే వాళ్ళు మూర్ఖులని, 50 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు. కనీసం నీళ్లు తేలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. 24 గంటల కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్‌ఘడ్‌లో 5 గంటల కరెంటు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.

Also Read : Suvarna Bhumi Fraud: నకిలీ రసీదులతో మోసం.. సువర్ణభూమి ఎండీతో పాటు పలువురిపై కేసు

మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం 30 వేల కోట్లు ఇస్తా అంది అని ఆయన తెలిపారు. కేసీఆర్ దయవల్ల ఊర్లు బాగుపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇస్తున్న పెన్షన్ వల్ల గ్రామాల్లో వృద్దులకు గౌరవం పెరిగిందని, సుపరిపాలనకు నాడు ఎన్టీఆర్ బీజం వేస్తే, నేడు దాన్ని కేసీఆర్ పరిపూర్ణం చేశాడన్నారు. కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని సగం నాశనం చేస్తే, బీజేపీ వాళ్ళు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం వస్తుంది అన్నాడు.. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో కరెంటు తీగల పై బట్టలు ఆరవేసుకోవాలి అన్నాడన్నారు. ఉచిత కరెంటు, రైతు బంధు కోసం సరిహద్దు రాష్ట్రాల రైతులు గుంట స్థలం కొనుక్కుంటున్నారు. కేసీఆర్ ను విమర్శించడానికి కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు ఉండాలని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.

Also Read : Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ లైట్ లాంచ్.. తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్.. ధర, బెనిఫిట్స్ ఇవే..