NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా.?

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్‌ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు కాదు, బ్రోకర్, పైరవీకారుడని దేశమంతా తెలుసు అని విమర్శించారు. రైతులను అవమానపరిచినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని ఆయన అన్నారు. 8 రోజులపాటు ఉద్యమిస్తామని, రైతులకు కాంగ్రెస్ మోసాలపై అవగాహన కల్పించి గుణపాఠం చెప్పేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఘోరంగా మాట్లాడారని, రైతులంతా సమావేశమై కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని తీర్మాణాలు చేశారన్నారు.

Also Read : Sabitha Indra Reddy : ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఒక్కటే అడుగుతున్నా… టీడీపీలో ఉన్నప్పుడు నాతో పని చేశారు. కాంగ్రెస్ హాయాంలో కరెంట్ సమస్యతో ఎండిపోయిన పంటలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళన చేయలేదా? కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ వైర్లపై బట్టలు ఎండవేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఒక గంట కరెంట్ కు ఎకరం పారుతుందని అంటున్నారు.

Also Read : Ananya Nagalla : ఆ విషయం లో తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

కాళేశ్వరం ప్రాజెక్టు లక్షకోట్లు ఖర్చు చేశారని అబద్దాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో నే భూగర్భ జలాలు పెరిగాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24గంటల కరెంట్ ఇస్తున్నారా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో చెప్పండి.
రైతులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రైతుకు పిల్లను కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. కేసిఆర్ పాలనలో ఎంత భూమి ఉందని అడిగి పిల్లను ఇస్తున్నారు. కేసిఆర్ కృషి తో రైతుల ఆస్తుల విలువ పెరిగింది. రైతు రాజ్యం కేసిఆర్ దయవల్ల వచ్చింది.’ అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.