Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : ఆధారాలు చూపెట్టని రేవంత్ రెడ్డిని, బండి సంజయ్‌ని ఏం చేయాలి

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదు, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఇవాళ ఆయన వరంగల్‌ జిల్లాలో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత వేటు హీనమైన చర్య, ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖునీ చేస్తుందని, బండి సంజయ్, రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడారు, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు, మరీ విళ్ళనేమి చేయాలన్నారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడిన మాటలకు నీ మీద ఏ కేసులు పెట్టాలన్నారు. పేపర్ లీకేజ్ మీదా ఆధారాలు చూపెట్టని రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని ఏం చేయాలన్నారు.

Also Read : Pathu Thala: శింబు సినిమాలో ఆర్య భార్య ఐటెమ్ సాంగ్ అదిరింది…

అనర్హత వేటు మాత్రం వేయమని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు, దేశంలో ఎక్కడ లేని విదంగా ఎకరానికి 10వేలు నష్టపరిహారం ఇస్తున్నాడని ఆయన కొనియాడారు. ప్రతీ ఒక్క రైతును ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండే ప్రసక్తే లేదు, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు విషయంలో మాత్రమే మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు, ఓటుకు నోటు కేసులో బీజేపీ జైలుకు పంపుతుందని భయపడుతున్నాడు కావచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read : Man Kills Wife: కాళ్లు చేతులు కట్టి గొంతుకోసి భార్య హత్య.. ఆపై రైలు కింద దూకి..

Exit mobile version