Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : తెలంగాణపై మోడీది సవతి తల్లి ప్రేమ

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

నిన్న బీఆర్‌ఎస్‌ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సభలో సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీపై సైతం మండిపడ్డారు. అయితే.. కేసీఆర్‌ మాటలపై బీజేపీ శ్రేణులు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయంలో ఇంత పెద్ద సభ ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణపై మోడీది సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చూస్తున్నారని, రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ గురించి చూసుకో అంటూ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని మెచ్చుకుంది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మా పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకున్నారన్నారు. బండి సంజయ్‌కు వెంట్రుకలే కాదు మెదడు కూడా లేదంటూ సెటైర్లు వేశారు మంత్రి ఎర్రబెల్లి.

Also Read : Google: సుప్రీంకోర్టులో గూగుల్‌కు చుక్కెదురు.. రూ.1337 కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే

అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. నిన్నటి సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, తెలంగాణలో కేసీఆర్ పాలనను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకున్నారన్నారు. బీజేపీ నాయకుల కంటికి పొరలు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కనపడడం లేదు.. మీరు కంటి వెలుగు స్కీం లో పరీక్ష చేయించుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. 380 రోజుల తర్వాత బీజేపీ కనపడదని, రాబోయేది కేసీఆర్ సర్కారే అని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చాలని సవాల్‌ విసిరారు. తరువాత అరూరి రమేష్ మాట్లాడుతూ.. నిన్నటి జనసందోహాన్ని చూసి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలాంటి పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. కేసీఆర్‌కు వచ్చే సపోర్ట్ చూసి బీజేపీ వాళ్ళు వణుకుతున్నారన్నారు.

Also Read : Microsoft Layoff: రెండు దశాబ్ధాల అనుబంధం.. భారతీయ ఉద్యోగి తొలగింపు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Exit mobile version