అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ.. కనకదుర్గమ్మ ఆలయం ఎప్పుడూ వివాదాల్లో ఉంటుంది. అధికారుల తీరు వల్ల భక్తులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. తాజాగా ఓ మేగజైన్ కథనం వివాదానికి ఆజ్యం పోసింది. అద్వైత వేదాంత సిద్దాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త అయిన ఆది శంకరాచార్యులు గురించి ప్రచురించిన కథనం ఆధ్యాత్మిక వర్గాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గ గుడి ఆధ్వర్యంలో శ్రీకనకదుర్గ ప్రభ మాసపత్రిక ప్రచురించబడుతుంది. ఈ మాసపత్రికకు దుర్గగుడిలోని ఉద్యోగి ఎడిటర్ గా విధులు నిర్వర్తిస్తాడు. ఆలయంలో పనిచేస్తున్న గంగాధర్ ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రచురించిన పుస్తకంలో ఆది శంకరాచార్యులు గురించి కథనం వ్రాసారు.. ఈ కథనం ఇప్పుడు దుమారం రేపుతుంది.
Read Also: Cricket Betting Gang: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కమిషనర్ చౌహాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆది శంకరాచార్యులు గోదావరి నదీతీర ప్రాంతపర్యటనలో శంకరులు సంచారం చేసినప్పుడు మీరు ఎవరు? మీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి ? అని కొందరు అడిగిన సమయంలో శంకరులు తన పేరు శంకరాచార్య, త్వష్ట విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మించాను అంటూ ఈ విధంగా సమాధానం చెప్పారని విదేశీయుడైన రచయిత శంకర విజయలో అల్ర్ఫెడ్ ఎడ్వర్ట్ రాబర్ట్స్ తెలియజేశారంటూ ప్రచురించారు.బ్రాహ్మణ వంశానికి చెందిన శంకరాచార్యులను విశ్వబ్రహ్మణ వంశానికి చెందిన వారిగా ప్రచురించడంపై ఆధ్యాత్మిక వర్గాలు మండిపడుతున్నాయి.
ఈ కధనంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఆలయ ఈవోను విచారణ చేయాలని ఆదేశించారు. ఆలయ ఈవో విచారణ అనంతరం శ్రీకనకదుర్గ ప్రభ మాసపత్రిక కు ఎడిటర్ గా విధులు నిర్వర్తిస్తున్న గంగాధర్ కు నోటీసులు జారీ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు త్రిసభ్య కమీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ త్రిసభ్య కమీటిలో ఆలయ పండితులు, అర్చకులు పరిశీలించిన తరువాతనే ప్రచురిస్తామంటూ వివరణ ఇచ్చారు.
Read Also:Heat Waves Warning: రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. తస్మాత్ జాగ్రత్త
