Prabhas: వెకేషన్‌కు వెళ్లిన డార్లింగ్.. ఎక్కడికో గెస్ చేయండి!

Most Valuable Indian Actor Prabhas

Most Valuable Indian Actor Prabhas

Prabhas: టాలీవుడ్ డార్లింగ్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్‌ల నుంచి చిన్న విరామం తీసుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై మరింత జాగ్రత్తగా, పూర్తి ఫోకస్‌తో పని చేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్, కొద్ది రోజులు రీఛార్జ్ అవ్వడానికి వెకేషన్‌కు రెడీ అయ్యారు.

READ ALSO: PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం.. పశ్చిమాసియాపై చర్చించే అవకాశం

నిర్విరామంగా షూటింగ్స్‌లో పాల్గొంటున్న ఈ పాన్ ఇండియా స్టార్, వేసవి సెలవుల కోసం ఇటలీకి బయలుదేరారు. తాజాగా బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఇటలీకి పయనమయ్యారు. అక్కడ కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపి, మేకోవర్, రీఛార్జ్ అయిన తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. విరామం తర్వాత ఆయన నేరుగా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌లో ఉన్న సినిమాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ అందులో ఒకటి. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న చిత్రం స్పిరిట్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది మార్చి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 AD సీక్వెల్: సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, ప్రభాస్ వెకేషన్ నుంచి రాగానే కీలక షెడ్యూల్స్ ప్రారంభం కానున్నాయని టాక్. బాక్సాఫీస్ వద్ద ‘రాజా సాబ్’ ఫలితం ప్రభాస్ అభిమానులను కొంత నిరాశపరిచినప్పటికీ, రాబోయే సినిమాల లైనప్ చూస్తుంటే డార్లింగ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిన్న విరామం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, ఆ తర్వాత వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

READ ALSO: Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం