Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కూడా మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బాస్ మరొక కొత్త సినిమాను కూడా కన్ఫార్మ్ చేశాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని హిట్ చిత్రం ‘వాల్లేరు వీరయ్య’ ను అందించిన దర్శకుడు బాబీ కొల్లి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రాబోతుంది.
READ ALSO: Greenland: డెన్మార్క్ చిన్నదేశం, గ్రీన్‌లాండ్‌ను కంట్రోల్ చేయలేదు.. ట్రంప్ సహాయకుడి కామెంట్స్..
సినీ సర్కిల్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బాస్ కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 25, 2026న అధికారికంగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. కానీ ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ప్రారంభించిన విశ్వంభర చిత్రం వీఎఫ్‌ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ, ఈ ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
READ ALSO: PM Mudra Yojana: పైసా గ్యారెంటీ లేకుండా రూ.20 లక్షల రుణం.. అవకాశం మిస్ అవ్వకండి!
