England vs Australia: వర్షంతో ప్రభావితమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఐదవ వన్డేలో DLS పద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజిటింగ్ టీమ్ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ పరిస్థితుల్లో సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్‌గా మారింది. చివరి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Jr.ఎన్టీఆర్ : దేవరకు సోమవారం పరిక్ష మొదలు..నిలుస్తాడా..?
ఆ తర్వాత లక్ష్య ఛేదనకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు 20.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ని పునఃప్రారంభించలేకపోయారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పూర్తయిన తర్వాత, డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతి (DRS) ఆధారంగా విజయం లేదా ఓటమిని నిర్ణయించారు. దీనిలో ఆస్ట్రేలియాను 49 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ జోడీ మంచి శుభారంభం అందించింది.
SS Thaman : గేమ్ చేంజర్, ఓజీ సినిమాలపై థమన్ సంచలన పోస్ట్
వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియాను 5.1 ఓవర్లలో 50 పరుగులు దాటించారు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి ఫిల్ సాల్ట్‌కి హెడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెడ్ 26 బంతుల్లో 31 పరుగులు చేశాడు. హెడ్ అవుట్ అయిన తర్వాత, షార్ట్ తన మెరుపు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దాంతో ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలో 100 పరుగులు దాటించాడు.