NTV Telugu Site icon

Telangana Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. 25 న బడ్జెట్.. 31 వరకు సభ..

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఉన్న స్పీక‌ర్ చాంబ‌ర్‌ లో బీఏసీ (బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ) తాజాగా స‌మావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాలలు హాజ‌ర‌య్యారు. ఇక నేడు జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఆమె మృతికి సంతాపంగా హాల్ లోని స‌భ్యులంద‌రూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. చివరగా అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు.

Union budget 2024: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో గందరగోళం.. రూ.10లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఇక ఆపై జరిగిన బీఏసీ సమావేశంలో.. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు జరగనున్నాయి. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చ జరగనుంది. ఆ మరుసటి రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024 : బడ్జెట్ తర్వాత వేటి రేట్లు పెరిగాయి.. ఏవేవి తగ్గాయో చూద్దాం