Supreme Court: జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కుల ప్రాతిపదికన పనిని విభజించడం ద్వారా జైలు మాన్యువల్ నేరుగా వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని, అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. జైళ్లలో కుల వివక్షను ప్రోత్సహించే జైలు మాన్యువల్‌లోని నిబంధనలను మార్చాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
Read Also: Hassan Nasrallah: నస్రల్లా ముందే కాల్పుల విరమణకు అంగీకరించాడు.. లెబనాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం
కుల ప్రాతిపదికన జైళ్లలో పనులు పంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం ఆధారంగా పని అప్పగించకూడదు. జైలు నిబంధనలలో స్పష్టమైన వివక్ష ఉందని కోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. అదేవిధంగా ఇతర కులాల ఖైదీలకు ఆహారం వండుకునే పని కల్పించారని మండిపడింది. జైలు మాన్యువల్‌లోని ఖైదీల కులానికి సంబంధించిన వివరాల వంటి సూచనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనితో పాటు, శిక్ష పడిన లేదా అండర్ ట్రయల్ ఖైదీల రిజిస్టర్ నుండి కుల కాలమ్‌ను తొలగించాలి. జైళ్లలో కుల వివక్షపై సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా నివేదికలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
జైలులో క్లీనింగ్ పనులు కేవలం కింది కులాల ఖైదీలకు మాత్రమే అప్పగించవద్దని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇది ఆర్టికల్ 15 ఉల్లంఘన అంటూ వ్యాఖ్యానించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెంటనే జైలు మాన్యువల్‌లో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం.