Site icon NTV Telugu

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్!

Jk

Jk

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు.

READ MORE: Menstruation Period: నెలసరి ఆలస్యం కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి!

ఇదిలా ఉండగా.. గతనెలాఖరున కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావించారు. వీరిని భద్రతా బలగాలు చుట్టుముట్టి మట్టుబెట్టినట్లు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లతో కూడిన బలగాలు మార్చి 25 తెల్లవారుజామున హిరానగర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ ఐపీఎస్ పాస్పోర్టు రద్దు

Exit mobile version