Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణం అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. దానిని చూస్తే తీవ్రమైన పరిస్థితి” అని అర్థం వచ్చేలా ఒక ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. దీనిని కేంద్రప్రభుత్వమే పంపింది. ఎమర్జెన్సీ నోటిఫికేషన్ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా చాలా మంది ఫోన్లకు ఈ మెసేజ్ వచ్చింది. కేవలం ఈ రోజు మాత్రమే కాకుండా గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి మెసేజ్ లను పంపించింది కేంద్రప్రభుత్వం. కొంతమంది వినియోగదారులకు జూలై 20, ఆగస్టు 17న కూడా ఇలాంటి మెసేజ్ లను పంపారు.
Also Read: Rahul Gandhi: ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో సూట్ కేసులు మోసిన రాహుల్ గాంధీ
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో కేంద్రం ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. తాజాగా, గురువారం ఉదయం 11:41 గంటల ప్రాంతంలో దీనిని పరీక్షించగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పెద్ద సౌండ్‌తో ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. తరువాత కొద్ది సేపటికి 12:10 నిమిషాల ప్రాంతంలో కూడా మరోసారి ఇలాంటి మెసేజ్ వచ్చింది. దీనిని కమ్యూనికేషన్స్ సెల్యులార్ బ్రాడ్‌కాస్ట్ సర్వీస్ విభాగం పంపించింది. “అత్యవసర హెచ్చరిక: తీవ్రమైన పరిస్థితి” అంటూ ఈ హెచ్చరిక మెసేజ్ వచ్చింది. ఏవైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రజలను వెంటనే అప్రమ్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ ఆపరేటర్లు , మొబైల్ సిస్టమ్‌ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు టెలికాం, మాస్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ఈ మెసేజ్ రావడంతో చాలా మంది దానిని స్ర్కీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!