Shocking : మహారాష్ట్రలో దారుణం.. నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో భారీగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులను గుర్తు తెలియని వారు నదిలో వేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలో విస్మయానికి గురి చేస్తోంది. తమ్‌గావ్ పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టగా వారికి నమ్మలేనటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ స్థానికంగా వ్యాప్తి చెందగానే నది వద్దకు భారీగా గ్రామస్థులు చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.
Read Also: Shivani Rajashekar: ఆ విషయంతో పోలిస్తే నాది చిన్నదే అంటున్న శివాని రాజశేఖర్
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి మరణించిన శిశువులను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బుల్దానాలోని సంగ్రామ్‌పూర్ తాలూకా కోలాడ్ లోని వాన్ నదిలో చాలా మృతదేహాలు కనిపించాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉండవచ్చు. ఈ ఘటన గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని తమ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో తమ్‌గావ్ పోలీసులు ఈ ప్రాంతంలో అబార్షన్ రాకెట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. త్వరలో వాటిని కఠినతరం చేస్తామని గ్రామస్థులకు నచ్చ జెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!