Site icon NTV Telugu

Suspects : గన్ తో తిరుగుతున్న ముగ్గురు యువకులు అరెస్టు

Police Arrested

Police Arrested

Suspects : ఏలూరులో ముగ్గురు యువకులుతుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, ఎలాంటి నేరానికి పాల్పడనున్నారు అనే కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. ఏలూరు టూటౌన్‌ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కారంతా గాలించగాతుపాకీ దొరికింది. వెంటనే ఆ ముగ్గురిని కారు సహా స్టేషన్‌కు తరలించారు. ఏదైనా నేరం చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆముగ్గురూ నగర శివారు ప్రాంతానికి చెందినవారు. కొత్త పేట ఎందుకు వచ్చారు, ఆ సమయంలో ఏం చేసేందుకు వచ్చారు అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తుపాకీ ఏరకానికి చెందిందో ఇంకా స్పష్టత రాలేదు. .

Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది..

Exit mobile version