NTV Telugu Site icon

UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి

Up

Up

మొన్నటి వరకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేయగా.. తాజాగా ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

Read Also: CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేష‌న్ స‌మీక్షలో సీఎం చంద్రబాబు

కతన్రియాఘాట్ వైల్డ్ లైఫ్ డివిజన్.. వివిధ రకాల వన్యప్రాణులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనిపించే పులి, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, మొసలి మొదలైన వాటిని చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే గత నెల నుండి, కతన్రియాఘాట్ వన్యప్రాణి డివిజన్ ప్రాంతంలో వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, చిరుతపులులు గత 20 రోజుల్లో ముగ్గురిని చంపేశాయి. జనవాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. అడవిలో సరిపడా ఆహారం, సరైన ఆవాసాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతుండగా, జనావాసాల్లోకి వచ్చి చంపుకుతింటున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి భయంతో చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.

Read Also: Wayanad: ఎల్లుండి ప్రియాంక గాంధీ నామినేషన్‌.. పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ