ELECTIONS 2024 : కాంగ్రెస్ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నాలుగో జాబితాను 46 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. ఇందులో రాజ్ గఢ్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి 12, ఉత్తరప్రదేశ్ నుంచి 9, తమిళనాడు నుంచి 7, రాజస్థాన్ 3, ఉత్తరాఖండ్, మణిపుర్, జమ్ము కశ్మీర్‌లో రెండేసి స్థానాలకు అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది.
ALSO READ: IPL 2024 Tickets: విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!
Also Read
- Sanju Samson: సంజు శాంసన్ అరుదైన రికార్డు.. అభిషేక్ శర్మను దాటవేసిన సంజూ..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
వీరితోపాటు అసోం, బంగాల్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులలో ఒక్కో స్థానానికి సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ తాజా జాబితాతో ఇప్పటివరకు కాంగ్రెస్ మొత్తం 184 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పై ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఈయన ఇదివరకే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ALSO READ: Motorola Edge 50 Pro : మార్కెట్లోకి వచ్చేస్తున్న మోటోరోలా స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?
రాయ్.. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1996-2007 మధ్య 3 మార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆపై జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా 2012లో మరోసారి గెలిచారు అజయ్ రాయ్.
Congress releases the fourth list of 46 candidates for the upcoming Lok Sabha elections.
Congress leader Digvijay Singh to contest from Rajgarh Lok Sabha Constituency, UP Congress President Ajay Rai from Varanasi, Imran Masood from Saharanpur, Virender Rawat from Haridwar and… pic.twitter.com/wpnr6kvoUr
— ANI (@ANI) March 23, 2024
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్ అరుదైన రికార్డు.. అభిషేక్ శర్మను దాటవేసిన సంజూ..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..